BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday 20 March, 2012

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA


 

DWARAM TYAGARAJU

తల్లియాపె కృష్ణునికి తండ్రి యీతడు
చల్లగా లోకములెల్లా సంతోసమందెను


అరుదై శ్రావణబహుళాష్టమినాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు-
కరములందు బెట్టితే కడుసంతోసించెను
 

తక్కక యమునానది దాటతడు రేపల్లెలో
పక్కన యశోదాదేవి పక్కబెట్టెను
యెక్కువనాపె కృష్ణునినెత్తుక నందగోపుని
గక్కన వినిపించితే కడు సంతోసించెను


మరిగి పెద్దై కృష్ణుడు మధురలో గంసుచంపి
బెరసి యలమేల్మంగ బెండ్లాడి
తిరమై శ్రీవేంకటాద్రిని దేవకీదేవియు
యిరవైతే వసుదేవుడేచి సంతోసించెను



talliyApe kRShNuniki taMDri yItaDu
callagA lOkamulellaa saMtOsamaMdenu


arudai SrAvaNabahuLAShTaminATi rAtri
tiruvavatAramaMdenu kRShNuDu
yiravai dEvakidEvi yettukoni vasudEvu-
karamulaMdu beTTitE kaDusaMtOsiMcenu


takkaka yamunAnadi dATataDu rEpallelO
pakkana yaSOdAdEvi pakkabeTTenu
yekkuvanApe kRShNuninettuka naMdagOpuni
gakkana vinipiMcitE kaDu samtOsiMcenu


marigi peddai kRShNuDu madhuralO gamsucaMpi
berasi yalamElmaMga beMDlADi
tiramai SrIvEMkaTAdrini dEvakIdEviyu
yiravaitE vasudEvuDEci samtOsimcenu




No comments:

Post a Comment