BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday 24 March, 2012

ANNAMAYYA SAMKIRTANALU--ALAMELUMANGA


 





G.N.NAIDU&G.BINATI
అలమేలుమంగ యీకె ఆనుక వద్దనుండది
చెలరేగి కందువలు చిత్తగించవయ్యా


తరుణిదేహమే నీకు తగుదివ్యరథము
గరుడధ్వజంబాపె కప్పుపయ్యద
తురగములు రతుల దోలెడు కోరికెలు
సరినెక్కి వలపులు జయించవయ్యా


దిండు కలపిఱుదులు తేరుబండికండ్లు
అందనే పువ్వులగుత్తులాపె చన్నులు
కొండవంటిశృంగారము కోపునగల సొబగు
నిండుకొని దిక్కులెల్లా నీవే గెలువవయ్యా


వెలది కంఠము నీకు విజయశంఖమదిగో
నిలువెల్లసాధనాలు నీకునాపె
యెలమి శ్రీవేంకటేశ యిద్దరును గూడితిరి
పలుజయముల నిట్టే పరగవయ్యా

alamElumaMga yIke Anuka vaddanuMDadi
celarEgi kaMduvalu cittagiMcavayyA


taruNidEhamE nIku tagudivyarathamu
garuDadhwajambApe kappupayyada
turagamulu ratula dOleDu kOrikelu
sarinekki valapulu jayimcavayyA


diMDu kalapi~rudulu tErubamDikaMDlu
aMdanE puvvulaguttulApe cannulu
koMDavaMTiSRmgAramu kOpunagala sobagu
niMDukoni dikkulellA nIvE geluvavayyA


veladi kaMThamu nIku vijayaSaMkhamadigO
niluvellasAdhanAlu nIkunApe
yelami SrIvEMkaTESa yiddarunu gUDitiri
palujayamula niTTE paragavayyA 


ANNAMAYYA LYRICS BOOK NO--8
SAMKIRTANA NO--90
RAGAM MENTIONED--SUDHA VASANTAM




No comments:

Post a Comment