BKP
ఈతడే యీతడే సుండి యెంత యెంచి చూచినా
చేతనే వరాలిచ్చే శేషాచలేశుడు
విశ్వరూపపుబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము
ఐశ్వర్యస్వరాట్టా సామ్రాట్టయిన బ్రహ్మము
శాశ్వత బ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము
యీశ్వరుడై మహారాట్టై యిందరిలో బ్రహ్మము
సూర్యునిలో తేజము సోమునిలో తేజము
శౌర్యపుటనలునిభాస్వ తేజము
కార్యపుటవతారాల గనుగొనే తేజము
వీర్యపుటెజ్ఞభాగాల విష్ణునామ తేజము
పరమపూరుషమూర్తి ప్రకృతియైన మూర్తి
గరిమతో మహదహంకారమూరితి
ధర పంచతన్మాత్రలు తత్వములైన మూరితి
గరుడానంత సేనేశకర్తయైన మూరితి
భాగవతపు దైవము భారతములో దైవము
సాగిన పురాణ వేదశాస్త్ర దైవము
పోగులైన బ్రహ్మలను బొడ్డున గన్న దైవము
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము
ItaDE yItaDE suMDi yeMta yeMchi chUchinA
chEtanE varAlichchE SEshAchalESuDu
viSwarUpapubrahmamu virATTayina brahmamu
aiSwaryaswarATTA sAmrATTayina brahmamu
SASwata brahmAMDAlu SarIramaina brahmamu
yISwaruDai mahArATTai yiMdarilO brahmamu
sUryunilO tEjamu sOmunilO tEjamu
SauryapuTanalunibhAsva tEjamu
kAryapuTavatArAla ganugonE tEjamu
vIryapuTej~nabhAgAla vishNunAma tEjamu
paramapUrushamUrti prakRtiyaina mUrti
garimatO mahadahaMkAramUriti
dhara paMchatanmAtralu tatwamulaina mUriti
garuDAnaMta sEnESakartayaina mUriti
bhAgavatapu daivamu bhAratamulO daivamu
sAgina purANa vEdaSAstra daivamu
pOgulaina brahmalanu boDDuna ganna daivamu
SrIgaligi bhUpataina SrIvEMkaTadaivamu
No comments:
Post a Comment