G.N.NAIDU
జలజనాభ హరి జయ జయ
యిల మానేరము లెంచకువయ్యా
బహుముఖముల నీప్రపంచము
సహజగుణంబుల చంచలము
మహిమల నీ విది మరి దిగవిడువవు
విహరణ జీవులు విడువగ గలరా
పలునటనలయీప్రకృతి యిది
తెలియగ గడునింద్రియవశము
కలిసి నీ వందే కాపురము
మలినపు జీవులు మానగగలరా
యిరవుగ శ్రీవేంకటేశుడ నీమాయ
మరలుచ నీవే సమర్థుడవు
శరణనుటకే నే శక్తుడను
పరు లెవ్వరైనా బాపగలరా
jalajanABa hari jaya jaya |
yila mAnEramu leMcakuvayyA
bahumuKamula nIprapaMcamu
sahajaguNaMbula caMcalamu
mahimala nI vidi mari digaviDuvavu
viharaNa jIvulu viDuvaga galarA
palunaTanalayIprakRuti yidi
teliyaga gaDuniMdriyavaSamu
kalisi nI vaMdE kApuramu
malinapu jIvulu mAnagagalarA
yiravuga SrIvEMkaTESuDa nImAya
maraluca nIvE samarthuDavu
SaraNanuTakE nE SaktuDanu
paru levvarainA bApagalarA
No comments:
Post a Comment