PADMAJA VISWAS
రమ్మనవె చెలియ రమణుని నీడకు
యిమ్మనవే చనవులు యెలయింపుడేటికి
కన్నుల జూచినదాక కడలేదు తమకము
సన్నల మొక్కినదాక చల్లీ కూరిమి
మన్ననలడుగుదాక మలసీకోరికలు
యెన్నిలేవు యెడమాటలింకానేటికే
సరసమాడినదాకా జడివట్టీ చెమటలు
వరుసకు వచ్చుదాకా వంచీ జలము
గరిమపైకొన్నదాకా కమ్మినడియాసలు
యిరవై నడుమ దెర యికనేటీకే
కదిసి కూడినదాకా కడుజన్నులదిరీని
పెదవి యానినదాకా నిదేనోరూరీ
అదనశ్రీవేంకటేశుడు యంతలోనే నన్నుగూడె
యెదుటనే వొడబాటులింకానేటికే
rammanave celiya ramaNuni nIDaku
yimmanavE canavulu yelayimpuDETiki
kannula jUcinadaaka kaDalEdu tamakamu
sannala mokkinadaaka callI kUrimi
mannanalaDugudaaka malasIkOrikalu
yennilEvu yeDamaaTalimkAnETikE
sarasamaaDinadaakaa jaDivaTTI cemaTalu
varusaku vaccudAkA vamcI jalamu
garimapaikonnadaakaa kamminaDiyaasalu
yiravai naDuma dera yikanETIkE
kadisi kUDinadaakaa kaDujannuladirIni
pedavi yaaninadaakaa nidEnOrUrI
adanaSrIvEMkaTESuDu yamtalOnE nannugUDe
yeduTanE voDabATulimkAnETikE
ANNAMAYYA LYRICS BOOK NO--19
SAMKIRTANA--81
RAGAM MENTIONED--DESAKSHI
No comments:
Post a Comment