G.N.NAIDU
సీతాసమేత రామా శ్రీరామా
రాతినాతిజేసిన శ్రీరామా రామా
ఆదిత్యకులమునందు నవతరించినరామ
కోదండభంజన రఘుకులరామ
ఆదరించి విశ్వామిత్రుయాగముగాచినరామ
వేదవేదాంతములలో వెలసినరామ
బలిమిసుగ్రీవుపాలి నిధానమారామ
యిలమునులకభయము యిచ్చినరామ
జలధినమ్ముమొనను సాధించినరామ
అలరు రావణుదర్పహరణరామ
లాలించి విభీషణును లంకయేలించినరామ
చాలి శరణాగతరక్షకరామ
మేలిమిశ్రీవేంకటాద్రిమీద వెలసినరామ
తాలిమితో వెలయు ప్రతాపపు రామ
sItAsamEta raamaa SrIrAmA
raatinaatijEsina SrIrAmA rAmA
Adityakulamunamdu navatarimcinaraama
kOdaMDabhamjana raghukularaama
aadarimci viSwAmitruyaagamugaacinaraama
vEdavEdAMtamulalO velasinaraama
balimisugrIvupaali nidhaanamaaraama
yilamunulakabhayamu yiccinaraama
jaladhinammumonanu saadhimcinaraama
alaru raavaNudarpaharaNaraama
laalimci vibhIShaNunu lamkayElimcinaraama
caali SaraNAgatarakShakaraama
mElimiSrIvEMkaTAdrimIda velasinaraama
taalimitO velayu prataapapu raama
ANNAMAYYALYRICS.BOOK NO:3
SAMKIRTANA--516
RAGAM MENTIONED--SALAMGANATA
No comments:
Post a Comment