ASHA BHOSLE
సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవు
రుకుమిణి దేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమున జెదరిన యలకలు
వికచాబ్జ ముఖము వెయి వేలాయె
తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై
నడపులమురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలికవాపను పరమంబాయ
అనుదినమునును నీ యలుమేలుమంగ
కనుగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి
చనువుల సొబగుల సంపదలాయ
satyaBAma sarasapu nagavu
nityamu hari madinE nelavu
rukumiNi dEviki rUpayavvaniki
sakala viBavamula sauKyatalu
cikurAMbaramuna jedarina yalakalu
vikacAbja muKamu veyi vElAye
toDavula SrIsati tolimerugulamai
naDapulamuripepu nagumOmu
taDayaka vAridhi daccina harikini
baDalikavApanu paramaMbAya
anudinamununu nI yalumElumaMga
kanugava jaMkena garvamulu
dinadinaMbulunu tiruvEMkaTapati
canuvula sobagula saMpadalAya
No comments:
Post a Comment