BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday 31 May, 2011

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU



ఏ పురాణముల నెంత వెదికినా
శ్రీపతి దాసులు చెడరెన్నడును

హరి విరహితములు అవిగొన్నాళ్ళకు
విరసంబులు మరి విఫలములు 
నరహరి గొలిచిటు నమ్మిన వరములు
నిరతములెన్నడు నెలవులు చెడవు 

కమలాక్షునిమతి గాననిచదువులు
కుమతంబులు బహు కుపథములు 
జమళినచ్యుతుని సమారాధనలు
విమలములేకాని వితథముగావు 

శ్రీవల్లభుగతి జేరనిపదవులు
దావతులు కపట ధర్మములు 
శ్రీవేంకటపతి సేవించు సేవలు
పావనము లధిక భాగ్యపు సిరులు 

E purANamula neMta vedikinA
SrIpati dAsulu ceDarennaDunu

hari virahitamulu avigonnALLaku
virasaMbulu mari viPalamulu 
narahari goliciTu nammina varamulu
niratamulennaDu nelavulu ceDavu 

kamalAkShunimati gAnanicaduvulu
kumataMbulu bahu kupathamulu 
jamaLinacyutuni samArAdhanalu
vimalamulEkAni vitathamugAvu 
SrIvallaBugati jEranipadavulu
dAvatulu kapaTa dharmamulu 
SrIvEMkaTapati sEviMcu sEvalu
pAvanamu ladhika BAgyapu sirulu

No comments:

Post a Comment