BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 8 July 2011

ANNAMAYYA SAMKIRTANALU----TIRUMAJJANAM


N.C.SRIDEVI


తిరుమజ్జనపువేళ దేవునికినిదివో
పరగ నారదాదులు పాడరో యిందరును


చింతదీరవేంచేసి సింహాసనముననుండి
దంతధావనాదికృత్యములు చేసి
సంతసాననంటరో సంపెంగనూనియదెచ్చి
కాంతలు గంధపు టటికలివెట్టరో


పంచామృతములతోడ పన్నీటమజ్జనమాడె
కాంచనాంబరాలు గట్టె కస్తూరి పూసె
నించుకునేసొమ్ములెల్లా నిలువుదండలు చాతె
పొంచి ధూపదీపతాంబూలములొసగరో


పాదుకలూ వాహనాలు బహుఛత్రచామరాలు
ఆదరించె శంఖకాహళాది వాద్యాలు
వేదపారాయణలతో వెసజూచే గపిలను
గాదెలలెక్కలడిగె గడేరాలు వినెను


అంగరంగవైభవాల కరళుపాడులువెట్టె
అంగపునిత్యదానాదులన్నియు చేసె
చెంగట యలమేలమంగ శ్రీవేంకటేశుడు గూడి
ముంగిటి పారుపత్యములు చేసీని
tirumajjanapuvELa dEvunikinidivO
paraga naaradaadulu paaDarO yiMdarunu

ciMtadIravEMcEsi siMhaasanamunanuMDi
daMtadhaavanaadikRtyamulu cEsi
saMtasaananaMTarO saMpeMganUniyadecci
kaaMtalu gaMdhapu TaTikaliveTTarO

paMcAmRtamulatODa pannITamajjanamADe
kaaMcanAMbaraalu gaTTe kastUri pUse
niMcukunEsommulellaa niluvudaMDalu cAte
poMci dhUpadIpataaMbUlamulosagarO

paadukalU vaahanaalu bahuCatracaamaraalu
AdariMce SaMkhakaahaLAdi vaadyaalu
vEdapaaraayaNalatO vesajUcE gapilanu
gaadelalekkalaDige gaDEraalu vinenu

aMgaraMgavaibhavaala karaLupaaDuluveTTe
aMgapunityadaanaadulanniyu cEse
ceMgaTa yalamElamaMga SrIvEMkaTESuDu gUDi
muMgiTi paarupatyamulu cEsIni 

ANNAMAYYALYRICSBOOK--no.7 
SAMKIRTANANO--473
RAGAMMENTIONED...MALHARI






No comments:

Post a Comment