BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 27 May, 2011

ANNAMAYYA SAMKIRTANALU_HANUMAN


G.N.NAIDU

అంజనీదేవి కొడుకు హనుమంతుడు
సంజీవితెచ్చినాడు సారె హనుమంతుడు

కలశాపురముకాడ కదళీవనాలనీడ 
అలవాడే ఉన్నవాడు హనుమంతుడు
అలరుకొండల కోనల అందని గుహలలోన
కొలువుసేయించుకొని కోరి హనుమంతుడు

సలుగా జంకబెట్టి  పళ్ళగుత్తిచేతబట్టి
అసురులనెల్లగొట్టి హనుమంతుడు
వసుధ ప్రతాపించి వడితోక కదలించి
వెసదెండపాలించి దివ్య హనుమంతుడు

ఉద్ధవిడి లంకజొచ్చి ఉంగరము సీతకిచ్చి
అద్దివో రాముడు మెచ్చీ హనుమంతుడు
అద్దుక శ్రీవేంకటేశు అటుబంటై వరమిచ్చి
కొద్దిమీర సంతోషాలే గుప్పి హనుమంతుడు

aMjanIdEvi koDuku hanumaMtuDu
saMjIviteccinADu saare hanumaMtuDu

kalaSApuramukADa kadaLIvanaalanIDa 
alavADE unnavADu hanumaMtuDu
alarukoMDala kOnala aMdani guhalalOna
koluvusEyiMcukoni kOri hanumaMtuDu

asalugaa jaMkabeTTi  paLLagutti cEtabaTTi
asurulanellagoTTi hanumaMtuDu
vasudha prataapiMci vaDitOka kadaliMci
vesadeMDapaaliMci divya hanumaMtuDu

uddhaviDi laMkajocci uMgaramu sItakicci
addivO raamuDu meccI hanumaMtuDu
adduka SrIvEMkaTESu aTubaMTai varamicci
koddimIra saMtOShaalE guppi hanumaMtuDu
ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--272
RAGAM MENTIONED--MALAVI


No comments:

Post a Comment