యెప్పుడేబుధ్ధిపుట్టునో యెరుగరాదు
తెప్పరపు మా బతుకు దేవునికే సెలవు
యేడనుండి పుట్టితిమో యింతకుతొల్లి యింక
యేడకు పోయెదమో యిటమీదను
వీడని మాయంతరాత్మ విష్ణుడు మా
జాడజన్మమతనికే సమర్పణము
గతజన్మ పితరులు అక్కడయెవ్వరో
యితవై ఇప్పటిపుత్రులిదియెవ్వరో
మతి మాజీవనమెల్ల మాధవుడు
అతనికే మాభోగాలన్నియు సమర్పణములు
తొడగి స్వర్గాదులు తొల్లియాడవో యీ
నడచే ప్రపంచము నాకేడదో
కడగె శ్రీవేంకటేశు గతియే మాది
అడలు పాపపున్యాలతనికర్పణము
yeppuDEbudHdHipuTTunO yerugaraadu
tepparapu maa batuku dEvunikE selavu
yEDanuMDi puTTitimO yiMtakutolli yiMka
yEDaku pOyedamO yiTamIdanu
vIDani maayaMtaraatma viShNuDu maa
jaaDajanmamatanikE samarpaNamu
gatajanma pitarulu akkaDayevvarO
yitavai ippaTiputrulidiyevvarO
mati maajIvanamella maadhavuDu
atanikE maabhOgaalanniyu samarpaNamulu
toDagi swargaadulu tolliyaaDavO yI
naDacE prapaMcamu naakEDadO
kaDage SrIvEMkaTESu gatiyE maadi
aDalu paapapuNyaalatanikarpaNamu
No comments:
Post a Comment