N.C.SRIDEVI
మాయింటికి రావయ్యా మాటలేటికి
ఛాయల సన్నల నీపై సంతోసమే నాతోని
మోమున కళలు దీరె ముక్కున నిట్టూర్పులూరి
నీమతకపుచేతకు నేనేమనేను
గామిడివనంగరాదు కల్లమోపపనిలేదు
యెమైనా నీపనులు తీయకులే నాకును
చెక్కుల చెమటమించి సెలవి నవ్వుల ముంచి
నీకొన్న నీయెమ్మేలకు నేనేమనేను
కక్కసించనిక వద్దు కడువేగి నియపొందు
ఎక్కడనుండి వచ్చినా తీయకులె నాకును
మోవిపై కెంపులు రాగి భావమెల్ల చిమ్మిరేగి
నీవెంత కాకు చేసినా నేనేమనేను
శ్రీవెంకటేశ ముందు చేకొను రతులవిందు
యీవేళ నన్నేలితివి యీయకులే నాకును
maayiMTiki raavayyaa maaTalETiki
Chaayala sannala nIpai samtOsamE naatOni
mOmuna kaLalu dIre mukkuna niTTUrpulUri
nImatakapucEtaku nEnEmanEnu
gaamiDivanaMgaraadu kallamOpapanilEdu
yemainaa nIpanulu tIyakulE naakunu
cekkula cemaTamiMci selavi navvula munci
nIkonna nIyemmElaku nEnEmanEnu
kakkasimcanika vaddu kaDuvEgi niyapomdu
ekkaDanuMDi vaccinaa tIyakule naakunu
mOvipai keMpulu raagi bhaavamella cimmirEgi
nIveMta kaaku cEsinaa nEnEmanEnu
SrIveMkaTESa muMdu cEkonu ratulaviMdu
yIvELa nannElitivi yIyakulE naakunu
No comments:
Post a Comment