BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday, 3 March 2011

ANNAMAYYA SAMKIRTANALU__KRISHNA



AUDIO


ఔనయ్యా మేలెరిగిన ఆణికాడవు
తానకమైన నీ దొరతనమెల్లా గంటిమి


చక్కదనమెరుగని జాణవా నీవేమైనా
టక్కరివై గుచ్చుదాని తగిలితివి
ఎక్కువగా నాముందర ఎవ్వరినో ఎంచగాను
చక్కగ నామదిలోన చల్లగాక యుండునా


కన్నెపాయమెరుగని ఘనుడవా నీవేమి
పిన్నవైరేవతిదేవి పెండ్లాడితివి
ఎన్నిక నాముందర నీయింతులజవ్వనమెంచి
అన్నింటా నామదిలోన ఆనందించకుందునా


ఇట్టె వినయము నీవెరుగవా నిరుము
వెట్టిన యింతికే కడుమేలువాడవు
చిట్టకములెంచితి శ్రీవెంకటనాధా నన్ను 
గట్టిగా కూడితివి నే కరగక యుందునా



aunayyaa mElerigina aaNikaaDavu
taanakamaina nI doratanamellaa gaMTimi


chakkadanamerugani jANavaa nIvEmainA
Takkarivai guccudaani tagilitivi
ekkuvagaa naamuMdara evvarinO eMcagaanu
chakkaga naamadilOna challagaaka yuMDunA


kannepaayamerugani ghanuDavaa nIvEmi
pinnavairEvatidEvi peMDlaaDitivi
ennika naamuMdara nIyiMtulajavvanameMci
anniMTA naamadilOna AnaMdiMcakuMdunaa


iTTe vinayamu nIverugavaa nirumu
veTTina yiMtikE kaDumEluvaaDavu
ciTTakamuleMciti SrIveMkaTanaadhaa nannu 
gaTTigaa kUDitivi nE karagaka yuMdunaa


No comments:

Post a Comment