PADMAVATI
అయ్యో నేమరినేనప్పుడేమైయుంటినో
అయ్యెడనీదాసినైతే ఆదరింతువుగా
అల్లనాడు బాలుడవై ఆవుల గాచేవేళ
చిల్లర దూడానైతే చేరి గాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లెలోనుండేనాడు
గొల్లెతనైనా నన్ను కూడుకొందువుగా
మేలిమి రామావతారవేళ రాయిరప్పనైన
కాలుమోపి బతికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై యుండినను
యేలి నన్నువనిగొని ఈడేర్తువుగా
వారిధిలోమత్స్యకూర్మావతారమునైననాడు
నీరులో జంతువునైన నీవు కాతువుగా
ఈ రీతి శ్రీవేంకటేశ యేలితివి నన్నుయిట్టె
మూరతూపుననిన్నాళ్ళు మోసపోతినిగా
ayyO nEmarinEnappuDEmaiyuMTinO
ayyeDanIdaasinaitE aadariMtuvugaa
allanaaDu baaluDavai aavula gaacEvELa
chillara dUDAnaitE cEri gAtuvugA
vallegaa viTuDavai rEpallelOnuMDEnaaDu
golletanainaa nannu kUDukoMduvugaa
mElimi raamaavataaravELa raayirappanaina
kaalumOpi batikiMci kaatuvugaa
vaali sugrIvula vadda vaanaramai yuMDinanu
yEli nannuvanigoni IDErtuvugA
vaaridhilOmatsyakUrmaavataaramunainanaaDu
nIrulO jaMtuvunaina nIvu kaatuvugaa
I rIti SrIvEMkaTESa yElitivi nannuyiTTe
mUratUpunaninnaaLLu mOsapOtinigA
No comments:
Post a Comment