BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 25 February 2011

ANNAMAYYA SAMKIRTANALU__RAMA



G.NAGESWARA NAIDU

దీనరక్షకుడఖిలవినుతుడు దేవ దేవుడు రాముడు
జానకీపతి కొలువుడీ ఘన సమర విజయుడు రాముడు

హరుని తారక బ్రహ్మమంత్రమై యమరినర్థము రాముడు
సురలగాచి యసురులనడచిన సూర్యకులజుడు రాముడు
సరయువందును ముక్తి చూరలు జనుల కొసగెను రాముడు
హరియె యాతడు హరి విరించుల కాదిపురుషుడు రాముడు

మునులఋషులకు నభయ మొసగిన మూలమూరితి రాముడు
మనసులోపల పరమయోగులు మరుగు తేజము రాముడు
పనిచి మీదటి బ్రహ్మ పట్టము బంటు కొసగెను రాముడు
మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముడు

బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు
నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుడు రాముడు
మెలుపు శ్రీ వేంకటగిరీంద్రముమీది దేవుడు రాముడు
వెలసె వావిలిపాటిలోపలి వీర విజయుడు రాముడు


dInarakshakuDakhilavinutuDu dEva dEvuDu rAmuDu
jAnakIpati koluvuDI ghana samara vijayuDu rAmuDu

haruni tAraka brahmamaMtramai yamarinayarthamu rAmuDu
suralagAchi yasurula naDachina sUryakulajuDu rAmuDu
sarayuvaM(naM)dunu mukti chUralu janula kosagenu rAmuDu
hariye yAtaDu hari viriMchula kAdipurushuDu rAmuDu

munularushulaku nabhaya mosagina mUlamUriti rAmuDu
manasulOpala paramayOgulu marugu tEjamu rAmuDu
panichi mIdaTi brahma paTTamu baMTu kosagenu rAmuDu
manujavEshamutODa nagajaku maMtramAyanu rAmuDu

balimi miMchina daivikamutO bhakta sulabhuDu rAmuDu
nilichi tanasarilEni vElupu nigamavaMdyuDu rAmuDu
melupu SrI vEMkaTagirIMdramumIdi dEvuDu rAmuDu

velase vAvilipATilOpali vIra vijayuDu rAmuDu

No comments:

Post a Comment