dinudanenu_ncsridevi
దీనుడను నేను దేవుడవు నీవు
నీ నిజరూపమే నెరపుటగాక
మతి జననమెరుగ మరణంబెరుగను
యితవుగ నినునింక నెరిగేనా
క్షితి బుట్టించిన శ్రీపతివి నీవు
గతి నాపై దయ దలతువు గాక
తలచపాపమని తలచపుణ్యమని
తలపున యిక నిన్ను దలచలేనా
అలరిననాలో అంతర్యామివి
కలుషమెడయ నను గాతువుగాక
తడవనాహేయము తడవనా మలినము
తడయక నీమేలు తడవేనా
విడువలేని శ్రీవేంకట విభుడవు
కడదాక నికగాతువు గాక
dInuDanu nEnu dEvuDavu nIvu
nI nijarUpamE nerapuTagAka
mati jananameruga maraNaMberuganu
yitavuga ninuniMka nerigEnA
kShiti buTTiMcina SrIpativi nIvu
gati nApai daya dalatuvu gAka
talacapApamani talacapuNyamani
talapuna yika ninnu dalacalEnA
alarinanAlO aMtaryAmivi
kaluShameDaya nanu gAtuvugAka
taDavanAhEyamu taDavanA malinamu
taDayaka nImElu taDavEnA
viDuvalEni SrIvEMkaTa viBuDavu
kaDadAka nikagAtuvu gAka
No comments:
Post a Comment