CKP
రాజపు నీకెదురేది రామచంద్ర
రాజీవనయనుడ రామచంద్ర
వెట్టిగాదు నీవలపు వింటి నారికి దెచ్చితివి
ఱట్టుసేయ పనిలేదు యిట్టె రామచంద్ర
గుట్టుతోడ జలనిధిపై గొండలు ముడివేసితి-
వెట్టు మఱవగవచ్చు నివి రామచంద్ర
బతిమితోడుత బైడిపతిమె గైకొటివి
రతికెక్క నీచలము రామచంద్ర
మితిమీరి జవ్వనము మీదుకట్టితివి నాకై
యితరు లేమనగల రిక రామచంద్ర
నావంటిసీతను నాగేటికొన దెచ్చితి
రావాడితమకముతో రామచంద్ర
యీవేళ శ్రీవేంకటాద్రి నిరవై నన్నుగూడితి
చేవదేర గండికోట శ్రీరామచంద్ర
rAjapu nIkedurEdi rAmachaMdra
rAjIvanayanuDa rAmachaMdra
veTTigAdu nIValapu viMTi nAriki dechchitivi
~raTTusEya panilEdu yiTTe rAmachaMdra
gu(ga)TTutODa jalanidhipai goMDalu muDivEsiti-
veTTu ma~ravagavachchu nivi rAmachaMdra
batimitODuta baiDipatime gaikoTivi
ratikekka nIchalamu rAmachaMdra
mitimIri javvanamu mIdukaTTitivi nAkai
yitaru lEmanagala rika rAmachaMdra
nAvaMTisItanu nAgETikona dechchiti
rAvADitamakamutO rAmachaMdra
yIvELa SrIvEMkaTAdri niravai nannu gUDiti
chEvadEra gaMDikOTa SrIrAmachaMdra
No comments:
Post a Comment