B.GOVIND
నేరిచి బ్రతికెవారు నీదాసులు
నేరమి బాసినవారు నీదాసులు
కామముక్రోధము రెంటిగాదని విడిచిమంచి-
నీమము పట్టినవారె నీదాసులు
దోమటి పాపపుణ్యాల దుంచివేసి చూడగానె
నీమాయ గెలిచినారు నీదాసులు
కికిరించిన ఆశలకిందవేసి మోక్షము
నిక్కినిక్కి చూచెవారు నీదాసులు
వెక్కసపు భక్తితోడ వెరపు మరపు లేక
నెక్కొన్న మహిమవారు నీదాసులు
అట్టెవేదశాస్త్రముల అర్ధము తేటపరచి
నెట్టుకొని మించినారు నీదాసులు
యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్ల
నెట్టువడతోసినారు నీదాసులు
nErici bratikevaaru nIdAsulu
nErami baasinavaaru nIdaasulu
kaamamukrOdhamu reMTigaadani viDicimaMci
nImamu paTTinavaare nIdaasulu
dOmaTi paapapuNyaala duMcivEsi cUDagaane
nImaaya gelicinaaru nIdaasulu
kikiriMcina aaSalakiMdavEsi mOkShamu
nikkinikki cUcevaaru nIdaasulu
vekkasapu bhaktitODa verapu marapu lEka
nekkonna mahimavaaru nIdaasulu
aTTevEdaSaastramula ardhamu tETaparaci
neTTukoni miMcinaaru nIdAsulu
yiTTe SrIvEMkaTESa yitaramaargamulella
neTTuvaDatOsinaaru nIdaasulu
No comments:
Post a Comment