B.GOVIND
వీడెవో లక్ష్మీపతి వీడెవో సర్వేశుడు
వీడెవో కోనేటిదండ విహరించే దేవుడు
కొండగొడుగుగనెత్తి గోవులకాచినాడు
కొండవంటి దానవుని కోరిచించెను
కొండశ్రీవేంకటమెక్కి కొలువున్నాడప్పటినీ
కొండవంటి దేవుడిదే కోనేటికరుతను
మాకులమద్దులు దొబ్బి మరికల్పభోజమని
మాకు వెలికి తచ్చెను మహిమీదికి
మాకుమీదలెక్కి గొల్లమగువల చీరలిఛ్ఛి
మాకులకోనేటిదండ మరిగినాడిదివో
శేషుని పడగనీడ చేరి యశోదయింటికి
శేషజాతి కాళిందు చిక్కించి కాచె
శేషాచలమనేటి శ్రీవేంకటాద్రిపై
శేషమై కోనేటిదండ చెలగెనీదేవుడు
vIDevO lakShmIpati vIDevO sarvESuDu
vIDevO kOnETidaMDa vihariMcE dEvuDu
koMDagoDuguganetti gOvulakaacinaaDu
koMDavaMTi daanavuni kOriciMcenu
koMDaSrIvEMkaTamekki koluvunnaaDappaTinI
koMDavaMTi dEvuDidE kOnETikarutanu
maakulamaddulu dobbi marikalpabhOjamani
maaku veliki taccenu mahimIdiki
maakumIdalekki gollamaguvala cIraliCCi
maakulakOnETidaMDa mariginaaDidivO
SEShuni paDaganIDa cEri yaSOdayiMTiki
SEShajaati kaaLiMdu cikkiMci kaace
SEShaacalamanETi SrIvEMkaTAdripai
SEShamai kOnETidaMDa celagenIdEvuDu
No comments:
Post a Comment