SRIVANI
వారిగో వీరిగో వాడల వాడల
కోరిక మీరగా గోపాలులు
జోరున కారీని చొక్కపు వుట్ల
పేరని పాలును పెరుగును
వారలు వట్టేవు వాకిటివుట్ల
కూరిమి కృష్ణుడు గోపాలులు
తొటతొట రాలీదొండ్లై వుట్ల
చిట్టిబెల్లాలు చిమ్మిరును
తటుకున బట్టీ దాపేరు పుక్కిళ్ళ
గుటుకలు మింగీ గోపాలులు
వానలు కురిసీ వరుస గుట్ల
తేనెలు పండ్లు తెంకాయలూ
ఆనేరు శ్రీవేంకటాధిపతిగూడి
కోనల గొందుల గోపాలులూ
vaarigO vIrigO vADala vADala
kOrika mIragaa gOpaalulu
jOruna kaarIni cokkapu vuTla
pErani paalunu perugunu
vaaralu vaTTEvu vaakiTivuTla
kUrimi kRShNuDu gOpaalulu
toTatoTa raalIdomDlai vuTla
ciTTibellaalu cimmirunu
taTukuna baTTI dApEru pukkiLLa
guTukalu mimgI gOpaalulu
vaanalu kurisI varusa guTla
tEnelu paMDlu temkaayalU
AnEru SrIvEMkaTAdhipatigUDi
kOnala gomdula gOpaalulU
ANNAMAYYA LYRICS.BOOK NO.27
SAMKIRTANA--388
RAGAM--SAMANTAM
No comments:
Post a Comment