BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday, 17 January 2011

ANNAMAYYA SAMKIRTANALU__VENKATESWARUDU



G.NAGESWARANAIDU

విచ్చేయవయ్యా వేంకటాచలము కొంత
కచ్చుగ నేవున్నచోటి కచ్చ్యుతనారాయణ


అల్లనాడు లంకసాదించందరు మెచ్చగ
వొల్లడి అయోధ్యకు వొరలినట్లు
ఎల్లగ కైలాసయాత్రకేగి కమ్మరి మరలి
వెల్లివిరి ద్వారకకు విచ్చేసినట్టు


ఎన్నికలో గోమంతమెక్కి జయము చేకొని
మన్ననతో మధురకు తరలినట్టు
అన్నిచోట్లానుండి అవ్విదములారగించ
వెన్నుడవై వేడుకతో విచ్చేసినట్టు


వహికెక్క త్రిపురాల వనితల బోధించి
మహినిందిరబొద్దికి మరలినట్లు
విహగగమన శ్రీవేంకటేశ మమ్ము గావ
విహితమై నా మదిలో విచ్చేసినట్టు
viccEyavayyaa vEMkaTAcalamu koMta
kaccuga nEvunnacOTi kaccyutanaaraayaNa

allanaaDu laMkasaadiMcaMdaru meccaga
vollaDi ayOdhyaku voralinaTlu
ellaga kailaasayaatrakEgi kammari marali
velliviri dwaarakaku viccEsinaTTu

ennikalO gOmaMtamekki jayamu cEkoni
mannanatO madhuraku taralinaTTu
annicOTlaanuMDi avvidamulaaragiMca
vennuDavai vEDukatO viccEsinaTTu

vahikekka tripuraala vanitala bOdhiMci
mahiniMdiraboddiki maralinaTlu
vihagagamana SrIvEMkaTESa mammu gaava
vihitamai naa madilO viccEsinaTTu

No comments:

Post a Comment