This Blog contains bhakti samkirtanas and kirtanas in different views..
Monday, 6 December 2010
ANNAMAYYA SAMKIRTANALU__SEVALU
VANI JAYRAM
వరుసతో సాసముఖా వసంత పూర్ణిమ నేడు
సిరుల ఈ విభవాలు సేవించరో
చరణం:-1
లలితపుగోవిందుడు లక్ష్మి మండపమందు ఉన్న
వలరాజిదివో కొలువగ వచ్చెను
వెలిచంద్రుడు తోడనే వెల్లగొడుగటుపట్టె
సులభాన పవనుడు సురటి విసరెను
చరణం:-2
పొందుగా వసంతుడు పూవుల పూజించవచ్చె
కందువతో తుమ్మెదలు బాణము చేసె
సందడించి చిలుకలు చదువకొచ్చె పద్యాలు
గొందినే పట్టిగవాలె కోవిలలు ఉద్గడించి
చరణం:-3
రతిదేవి మొదలైన రమణులు నాట్యమాడి
ప్రతి వసంతమాడే మేఘావళియెల్ల
తతి శ్రీవేంకటగిరి తావుకొని ఇందునందు
మితిమీరగ మొక్కేరు మెరసి దేవతలూ
varusatO saasamukhaa vasaMta pUrNima nEDu
sirula yI vibhavaalu sEviMcarO
caraNaM:-1
lalitapugOviMduDu lakShmi maMDapamaMduyunna
valaraajidivO koluvaga vaccenu
velichaMdruDu tODanE vellagoDugaTupaTTe
sulabhaana pavanuDu suraTi visarenu
charaNaM:-2
poMdugaa vasaMtuDu pUvula pUjiMchavacce
kaMduvatO tummedalu baaNamucEse
saMdaDiMci cilukalu caduvakocce padyaalu
goMdinE paTTigavaale kOvilalu udgaDiMci
caraNaM:-3
ratidEvi modalaina ramaNulu naaTyamaaDi
prati vasaMtamaaDE mEghaavaLiyella
tati SrIvEMkaTagiri taavukoni yiMdunaMdu
mitimIraga mokkEru merasi dEvatalU
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment