BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday, 7 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__VARNANA



BKP


కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి 


మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహువిభవముల మంటపములు గంటి 
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి
రహివహించిన గోపురములవె కంటి 


పావనంబైన పాపవినాశము గంటి
కైవశంబగు గగన గంగ గంటి 
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి
కోవిదులు గొనియాడు కోనేరి గంటి 


పరమ యోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజముల గంటి 
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి
తిరు వేంకటాచలాధిపు జూడగంటి 



VANIJAYRAM


kaMTi naKilAMDa tati kartanadhikuni gaMTi
kaMTi naGamulu vIDukoMTi nijamUrti gaMTi 


mahanIya Gana PaNAmaNula Sailamu gaMTi
bahuviBavamula maMTapamulu gaMTi 
sahaja navaratna kAMcana vEdikalu gaMTi
rahivahiMcina gOpuramulave kaMTi 


pAvanaMbaina pApavinASamu gaMTi
kaivaSaMbagu gagana gaMga gaMTi 
daivikapu puNyatIrthamulella boDagaMTi
kOvidulu goniyADu kOnEri gaMTi 


parama yOgIMdrulaku BAvagOcaramaina
sarilEni pAdAMbujamula gaMTi 
tiramaina giricUpu divyahastamu gaMTi
tiruvEMkaTAcalAdhipu jUDagaMTi 

No comments:

Post a Comment