G.BINATI
ఆహా నమో నమో ఆదిపురుష నీకు
ఈహల నెంతవాడ ఎట్టుగాచితివి
లోకాలోకములు లోననించుకొన్న నీవు
ఈకడ నాయాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాక్కుచే నీనామముల వడి నెట్టణగితివి
అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు
అన్నపానాదులివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు
వున్నతి నాపుట్టుగలో వొకచో నెట్టుంటివి
దేవతలచే పూజలు తివిరి గొనిననీవు
ఈవల నాచే పూజ యెట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రిమీద సిరితోగూడిన నీవు
ఈ వీధి మాయింట యిపుడెట్టు నిలిచితివి
VANI JAYRAM
AhA namO namO AdipuruSha nIku
Ihala neMtavADa eTTugAcitivi
lOkAlOkamulu lOnaniMcukonna nIvu
IkaDa nAyAtmalOna neTTaNagitivi
AkaDa vEdamulaku nagOcaramaina nIvu
vAkkucE nInAmamula vaDi neTTaNagitivi
anniTA brahmAdula yaj~naBOktavaina nIvu
annapAnAdulivi yeTTAragiMcitivi
sannuti pUrNuDavai janiyiMcina nIvu
vunnati nApuTTugalO vokacO neTTuMTivi
dEvatalacE pUjalu tiviri goninanIvu
Ivala nAcE pUja yeTTugoMTivi
SrI vEMkaTAdrimIda siritOgUDina nIvu
I vIdhi mAyiMTa yipuDeTTu nilicitivi
No comments:
Post a Comment