BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 1 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI


NALINAKSHA-Durga

నళినాక్ష నీకు నమస్కరించిన
ఫలము ఒగడనిక బ్రహ్మకు వశమా


పూర్వదోషములు పోద్రోలి మరియు
సర్వాపచారము శమియించి
గర్వితమదముల కసటువాపినను
నిర్వహించెనిదె నీనామము


నేడును చేసిన నేరములణచి 
వేడి కర్మముల  విడిపించి
వాడిదుహ్ఖముల వడి పరిహరించె
నాడెరగంగ నీనామము


ఉమ్మడిసుఖముల వొనరించి మాకు
సమ్మతి శుభములు జయమొసగి
ఇమ్ముల శ్రీవేంకటేశ్వరనిదివో
నెమ్మది రక్షించె నీనామము



naLinaakSha nIku namaskariMcina
phalamu ogaDanika brahmaku vaSamaa


pUrvadOShamulu pOdrOli mariyu
sarwaapacaaramu SamiyiMci
garwitamadamula kasaTuvaapinanu
nirwahiMcenide nInaamamu


nEDunu cEsina nEramulaNaci 
vEDi karmamula  viDipiMci
vaaDiduHKamula vaDi parihariMce
naaDeragaMga nInaamamu


ummaDisukhamula vonariMci maaku
sammati SuBamulu jayamosagi
immula SrIvEMkaTESwaranidivO
nemmadi rakShiMce nInaamamu

No comments:

Post a Comment