ENNADU-TEERAVU
ఎన్నడు తీరవు ఈపనులు
పన్నిన నీమాయ పరులంబాయె
పెక్కుమతంబుల పెద్దలు నడచి
ఒక్కసమ్మతై ఓడబడరు
పెక్కుదేవతలు పేరు వాడెదరు
తక్కక ఘనులము తామే యనుచును
పలికెడి చదువులు పలు మార్గంబులు
కలసి ఏకవాక్యత కాదు
చలవాలంబులు జనులును మానరు
పలు తత్త్వంబుల పచరించేరు
శరణాగతులకు శ్రీవెంకటేశ్వర
తిరముగ నీవే తీర్చితివి
పరమవైష్ణవులు పట్టిరి వ్రతము
ఇరవుగనాచార్యులెరుగుదురు
ennaDu tIravu Ipanulu
pannina nImaaya parulaMbAye
pekkumataMbula peddalu naDaci
okkasammatai ODabaDaru
pekkudEvatalu pEru vaaDedaru
takkaka ghanulamu taamE yanucunu
palikeDi caduvulu palu maargaMbulu
kalasi Ekavaakyata kaadu
calavaalaMbulu janulunu maanaru
palu tattwaMbula pacariMcEru
SaraNAgatulaku SrIveMkaTESwara
tiramuga nIvE tIrcitivi
paramavaiShNavulu paTTiri vratamu
iravuganaacaaryuleruguduru
No comments:
Post a Comment