BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday, 2 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU

MBK

వేదము దీర్చదు వేరే శాస్త్రములు
ఏదియు దీర్పదు ఇది నీమాయ

నీవల్ల బ్రతికిరి నిండుదేవతలు
నివల్ల అసురులు నెరిచెడిరి
ఆవల యిందరికాత్మవు నీవే
చేవదీరెనీ చిక్కులె భువిని

నెమ్మి పాండవుల నీవారంటివి
కమ్మర విడచితి కౌరవుల
యిమ్ముల నీవావి యిద్దరికొకటే
తెమ్మలాయనీ తీరని చిక్కు

జగమున నీదే స్వతంత్రమెల్లా
నెగడిన జీవులు నీవారు
తగుశ్రీవేంకటదైవమ యిన్నియు
తెగినీదాసులు తెలిసిన చిక్కు
P.RANGANATH 
vEdamu dIrcadu vErE SAstramulu
Ediyu dIrpadu idi nImaaya

nIvalla bratikiri niMDudEvatalu
nivalla asurulu nericeDiri
Avala yiMdarikaatmavu nIvE
cEvadIrenI cikkule bhuvini

nemmi paaMDavula nIvaaraMTivi
kammara viDaciti kouravula
yimmula nIvaavi yiddarikokaTE
temmalaayanI tIrani cikku

jagamuna nIdE swataMtramellaa
negaDina jIvulu nIvaaru
taguSrIvEMkaTadaivama yinniyu
teginIdaasulu telisina cikku

No comments:

Post a Comment