BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday 9 May, 2012

GURUSTUTI--ANNAMAYYA



ప|| శరణంటి మాతని సమ్మంధమునజేసి |
మరిగించి మమునేలి మన్నించవే ||
చ|| సకలవేదములు సంకీర్తనలుచేసి |
ప్రకటించి నిను బాడి పావనుడైన |
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల |
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ||
చ|| నారదాది సనకసనందాదులవలె |
పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి |
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల |
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ||
చ|| సామవేద సామగాన సప్తస్వరములను |
బాముతో నీసతినిన్ను బాడినయట్టి |
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచార్యుల |
వేమరుమెచ్చిన శ్రీవేంకటనిలయా ||


pa|| SaraNaMTi mAtani sammaMdhamunajEsi |marigiMci mamunEli manniMcavE ||

ca|| sakalavEdamulu saMkIrtanalucEsi |prakaTiMci ninu bADi pAvanuDaina |
akalaMkuDu tALLapAkannamAcAryula |vekaliyai yElina SrIvEMkaTanilaya ||
ca|| nAradAdi sanakasanaMdAdulavale | pErupaDi ninnu bADi peddalainaTTi |
ArIti dALLapAkannamAcAryula | cEri yElinayaTTi SrIvEMkaTanilaya ||
ca|| sAmavEda sAmagAna saptasvaramulanu | bAmutO nIsatininnu bADinayaTTi |
Amukonna tALLapAkannamAcAryula | vEmarumeccina SrIvEMkaTanilayA |

No comments:

Post a Comment