BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday, 15 December 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU




K.J.YESUDAS

వాడలవాడలవెంట వాడివో
నీడనుండీ చీరలమ్మే నేతబీహారి

పంచభూతములనెడి పలువన్నె నూలు
చంచలపుగంజి వోసి చరిసేసి
కొంచెపుకండెలనూలిగుణములనేసి
మంచిమంచిచీరలమ్మే మారుబేహారి

మటమాయముల తనమగువ పసిడినీరు
చితిపొటియలుకల జిలికించగా
కుటిలంపుజేతలు కుచ్చులుగా గట్టి
పటవాళిచీరలమ్మే బలుబేహారి

మచ్చికర్మమనేటి మైలసంతలలోన
వెచ్చపుకర్మధనము వెలువచేసి
పచ్చడాలుగా గుట్టి బలువేంకటపతి
ఇచ్చలకొలందులనమ్మే యింటిబేహారి

vADalavADalaveMTa vADivO
nIDanuMDI cIralammE nEtabIhAri

paMcabhUtamulaneDi paluvanne nUlu
camcalapugaMji vOsi carisEsi
komcepukaMDelanUliguNamulanEsi
maMcimaMcicIralammE maarubEhAri

maTamAyamula tanamaguva pasiDinIru
citipoTiyalukala jilikimcagA
kuTilaMpujEtalu kucculugA gaTTi
paTavALicIralammE balubEhAri

maccikarmamanETi mailasamtalalOna
veccapukarmadhanamu veluvacEsi
paccaDAlugA guTTi baluvEMkaTapati
iccalakolamdulanammE yiMTibEhAri
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA NO--275
RAGAM MENTIONED--VARALI

అన్నమయ్య భక్తుడు మాత్రమే కాదు. ఓ సామాజిక వేత్త కూడా. భగవద్భక్తినే కాదు... మన సంస్కృతిని ప్రచారం చేయాలి, ముందుకు తరాలకు అందించాలి అన్న స్పృహ ఉన్న మహాను భావుడు. ఇదిగో ఈ కీర్తన చూడండి... స్వామివారిని బట్టల వర్తకుడిగా అభివర్ణిస్తూ... చేనేత వృత్తిని ఈ కీర్తనలో ప్రతిబింబింప జేశారు. అంటే అడుగడుగునా భగవంతుడే ఉన్నాడు. పని చేసే ప్రతి చోటూ ఆయన రూపమే అని చెబుతున్నాడు. అంటే అన్నమయ్య పనులన్నీ మానుకుని భగవంతుణ్ని పూజించమని చెప్పలేదు... పనిలోనే భగవంతుణ్ని చూడమంటున్నాడు. ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్నారు. ఆయన సైతం అలానే చూశారు. మనల్ని అలాగే చూడమంటున్నారు.
COMENTARY BY 
NAGASAI SURI PARAVASTU

No comments:

Post a Comment