BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday 12 July, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


G.N.NAIDU

వలపుల సొలపుల వసంతవేళ యిది
సెలవి నవ్వకువే చెమరించీ మేను

శిరసు వంచకువే సిగ్గులు వడకువే
పరగ నిన్నతడు తప్పకచూచీని
విరులు దులుపకువే వెస దప్పించుకోకువే
సిరుల నీవిభుడిట్టే సేసవెట్టీని

చేయెత్తి యొడ్డుకోకువే చేరి యానవెట్టకువే
చాయలనాతడు నీచన్నులంటీని
ఆయములు దాచకువే అట్టే వెరగందకువే
మోయనాడీ సరసము మోహాన నీవిభుడు

పెనగులాడకువే బిగువు చూపకువే
ఘనశ్రీవేంకటేశుడు కౌగిలించీనీ
అనుమానించకువే అలమేల్మంగవు నీవు
చనవిఛ్ఛీనన్నునేలె సమ్మతించీ యాతడు
BKP


valapula solapula vasantavELa yidi
selavi navvakuvE cemariMcI mEnu


Sirasu vaMcakuvE siggulu vaDakuvE
paraga ninnataDu tappakacUcIni
virulu dulupakuvE vesa dappiMcukOkuvE
sirula nIvibhuDiTTE sEsaveTTIni


cEyetti yoDDukOkuvE cEri yAnaveTTakuvE
cAyalanAtaDu nIcannulaMTIni
Ayamulu dAcakuvE aTTE veragaMdakuvE
mOyanADI sarasamu mOhAna nIvibhuDu


penagulADakuvE biguvu cUpakuvE
ghanaSrIvEMkaTESuDu kougiliMcInI
anumAniMcakuvE alamElmaMgavu nIvu
canaviccInannunEle sammatiMcI yAtaDu
ANNAMAYYA LYRICS BOOK NO --12
SAMKIRTANA NO--385
RAGAM MENTIONED--SUDHDHA VASAMTAM



2 comments:

  1. నాకు చాలా చాలా ఇష్టమైన కీర్తన ఇది..ధ్యాంక్యూ...

    ReplyDelete
  2. Hai.. Don't Moderate this comment..please..

    నా బ్లాగును దర్శించినందుకు ధ్యాంక్యూ... నేను మీ బ్లాగును చాలా రోజులనుండీ ఫాలో అవుతున్నాను...
    మీ భక్తి ప్రచారానికి సదా కృతజ్ఞతలు....
    --సాయి

    ReplyDelete