BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday 2 May, 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU



SHOBHARAJ
నీతితో నడచితేను నెగులే లేదు
జాతి తప్పకుండితేను చలమే ఫలము


వొలిసి గైకొంటేను వొగరైనా దీపే
తెలిసితే దనలోనే దేవుడున్నాడు
పలుకులు మంచివైతే పగవారూ చుట్టాలే
చెలగి దిష్టించితేను చీకటిల్లు వెలుగు


నేరిచి బతికితేను నేలెల్లా నిధానము
వోరిచితే దనపంతం వూరకే వచ్చు
సారెకు నుతించితేను చట్టైనా కరగును
వూరకే గుట్టుననుంటే వూరికెల్లా నెక్కుడు


వాడికె సేసుకోంటే వలపెల్లా   నిలుపౌను
వేడుకతోనుండితే వెనకే ముందౌను
యీడులేని శ్రీవేంకటేశ్వరు కొలిచితేను
జాడుపడ్డ పనులెల్లా సఫలమౌను




nItitO naDacitEnu negulE lEdu
jAti tappakuMDitEnu calamE phalamu


volisi gaikoMTEnu vogarainA dIpE
telisitE danalOnE dEvuDunnADu
palukulu maMcivaitE pagavArU cuTTAlE
celagi diShTiMcitEnu cIkaTillu velugu


nErici batikitEnu nElellA nidhAnamu
vOricitE danapaMtam vUrakE vaccu
sAreku nutiMcitEnu caTTainA karagunu
vUrakE guTTunanuMTE vUrikellA nekkuDu


vADike sEsukOMTE valapellaa nilupounu
vEDukatOnuMDitE venakE muMdounu
yIDulEni SrIvEMkaTESwaru kolicitEnu
jADupaDDa panulellA saphalamounu




ANNAMAYYA LYRICS BOOK NO--14
SAMKIRTANA--42
RAGAM MENTIONED--SAMAMTAM

No comments:

Post a Comment