BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday 18 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU--ADHYATMIKAM




VEDAVATI PRABHAKAR


నానారూపధరుడు నారాయణుడు వీడే
పూనినవుమలెల్లా బొసగెనితనికి


గరిమ నేరులు వానకాలమున బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులుసేసే మజ్జనము
అరుదుగ బన్నీరెల్లా నమరే నీహరికి


అట్టేవెల్లమెయిళ్ళు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేననిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుగమరెను దైవాలరాయనికి


నిలువున సంపదలు నిలిచిరూపైనట్టు
తెలివిసొమ్ములపెట్టె దెరచినట్టు 
అలమేలుమంగ పురమున నెలకొనెనిదే
చెలరేగి శృంగారాల శ్రీవేంకటేశునకు



nAnArUpadharuDu nArAyaNuDu vIDE
pUninavumalellA bosagenitaniki


garima nErulu vAnakAlamuna benagoni
soridi samudramu coccinayaTlu
puruShasUktamuna viprulusEsE majjanamu
aruduga bannIrellA namarE nIhariki


aTTEvellameyiLLu AkasAna niMDinaTTu
gaTTigA mEnaniMDenu kappurakApu
voTTi tana viShNumAya voDalipai vAlinaTTu
taTTupuNugamarenu daivAlarAyaniki


niluvuna saMpadalu nilicirUpainaTTu
telivisommulapeTTe deracinaTTu 
alamElumaMga puramuna nelakonenidE
celarEgi SRMgArAla SrIvEMkaTESunaku








No comments:

Post a Comment