BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday 14 May, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM




SRIVANI
ఏమినవ్వేవే నాతోనింకా నీవు
వాములాయ వలపులు వట్టిజోలేలే


సరసములాడగానే జామువోయనిదివో
తెరమరగుననే తెల్లవారెను
యెరవులేక విభుడు యేమీ అనజాలడు
వరవాత నికనైనా వచ్చేవో రావో


ముంగురులు దిద్దగానే మొనలెక్కె  కొనగోరు
సింగారించుకోగానే సిగ్గుముంచెను
సంగతెరిగినపతి చలములు సాధించడు
యింగితమెరిగి మోవి యిచ్చేవో యీయవో


చేతులుపైజాచగానె సెలవుల నవ్వు ముంచె
గాతలకాగిలించగానె కాకదీరెను
యీతలశ్రీవేంకటేశుడు యిచ్చనెరిగి నినుగూడె
యేతుల యీవుపకారం యెంచేవీ యెంచవో



EminavvEvE nAtOniMkA nIvu
vAmulAya valapulu vaTTijOlElE


sarasamulADagAnE jAmuvOyanidivO
teramaragunanE tellavArenu
yeravulEka vibhuDu yEmI anajAlaDu
varavAta nikanainA vaccEvO rAvO


mumgurulu diddagAnE monalekke  konagOru
simgArimcukOgAnE siggumumcenu
samgateriginapati calamulu saadhiMcaDu
yimgitamerigi mOvi yiccEvO yIyavO


cEtulupaijAcagAne selavula navvu mumce
gAtalakAgilimcagAne kAkadIrenu
yItalaSrIvEMkaTESuDu yiccanerigi ninugUDe
yEtula yIvupakaaram yemcEvI yemcavO


ANNAMAYYA LYRICS BOOK NO--27
SAMKIRTANA NO--161
RAGAM MENTIONED--SOURASTRAM

No comments:

Post a Comment