BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday 8 March, 2012

ANNAMAYYA SAMKIRTANALU--KRISHNA


DWARAM TYAGARAJU


పచ్చిదేరుచునుట్ల పండుగాయెను
గచ్చులకు గొల్లెతలు కౌగిలించినట్లుగా


గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా
గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా


పీతాంబరముమీద పెద్దకిరీటముమీద
నేతిపాల చారలెల్ల నిండెనదీవో
జాతిగొల్లెతల నుట్లపారెగోలనెత్తికొట్టి
చేతులు జాచారగించి చిమ్మిరేగగాను


శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశాగోవిందా
శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశాగోవిందా


సొరిదిసొమ్ములమీద సోయగపుచెక్కులపై
పెరుగులు మీగడలు పేరుకొనేను
అరుదుగవీధులను అందరియుట్లుగొట్టి
దొరతనములతోడ దొమ్మిసేయగాను


గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా
గోవిందా హరి గోవిందా గోవిందా భజగోవిందా


పూనిశ్రీవేంకటేశుపై పొందీలమేలుమంగపై
తేనెలును చక్కెరలు తెట్టెగట్టేను
నానావిధములను నడుమనుట్లుగొట్టి
ఆనందాననారగించి అలరుచుండగాను


గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా
శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశాగోవిందా

paccidErucunuTla paMDugaayenu
gacculaku golletalu kougiliMcinaTlugaa


gOviMdA harigOviMdaa gOviMdaa bhajagOviMdaa
gOviMdA harigOviMdaa gOviMdaa bhajagOviMdaa


pItaaMbaramumIda peddakirITamumIda
nEtipaala caaralella niMDenadIvO
jaatigolletala nuTlapaaregOlanettikoTTi
cEtulu jaacaaragiMci cimmirEgagaanu


SrInivaasaa gOviMdaa SrIvEMkaTESAgOviMdA
SrInivaasaa gOviMdaa SrIvEMkaTESAgOviMdA


soridisommulamIda sOyagapucekkulapai
perugulu mIgaDalu pErukonEnu
arudugavIdhulanu aMdariyuTlugoTTi
doratanamulatODa dommisEyagaanu


gOviMdA harigOviMdA gOviMdA bhajagOviMdA
gOviMdA hari gOviMdaa gOviMdaa bhajagOviMdaa


pUniSrIvEMkaTESupai poMdialamElumaMgapai
tEnelunu cakkeralu teTTegaTTEnu
naanaavidhamulanu naDumanuTlugoTTi
aanaMdaananaaragiMci alarucuMDagaanu


gOviMdA harigOviMdA SrIvEMkaTESAgOviMdaa
SrInivaasaa gOviMdaa SrIvEMkaTESAgOviMdA
 gOviMdA harigOviMdASrIvEMkaTESAgOviMdaa
SrInivaasaa gOviMdaa SrIvEMkaTESAgOviMdA




No comments:

Post a Comment