BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 9 March, 2012

ANNAMAYYA SAMKIRTANALU--ADHYATMIKAM


BKP


దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
యీవల నీబంట నాకు నెదురింకనేదీ


కామధేనువు బిదుకగల కోరికలివెల్ల 
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీబంటనట కమ్మినిన్ను దలచితి-
నేమి మాకు గడమయ్య యిందిరారమణా


యెంచ గల్పవృక్షమును యిచ్చు సిరులెల్లాను
నించి కల్పవృక్షములనీడల కృష్ణుడవట
అంచెలనీబంటనట ఆత్మలో నిన్నునమ్మితి
వంచించ గడమయేది వసుధాధీశ


తగనొక్క చింతామణి తలచినట్ల జేసు
మిగులకౌస్తుభమణి మించిన కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో గొరతేది జగదేక విభుడా



dEvaSikhAmaNivi diShTadaivamavu nIvu
yIvala nIbaMTa naaku nedurimkanEdI


kaamadhEnuvu bidukagala kOrikalivella 
kaamadhEnuvulu pekkugAcE kRShNuDavaTa
kaamimci nIbaMTanaTa kammininnu dalaciti-
nEmi maaku gaDamayya yimdirAramaNA


yemca galpavRkShamunu yiccu sirulellaanu
nimci kalpavRkShamulanIDala kRShNuDavaTa
amcelanIbaMTanaTa aatmalO ninnunammiti
vamcimca gaDamayEdi vasudhaadhISa


taganokka cimtaamaNi talacinaTla jEsu
migulakoustubhamaNi mimcina kRShNuDavaTa
pagaTu SrIvEmkaTESa bhaktuDa nIkaTa nEnu
jagamulO goratEdi jagadEka vibhuDA




No comments:

Post a Comment