NEDUNURI
ఏటి జోలి చేకొంటివి యెంతవిరాళి
నీటున వింతికడకు నేడే రారాదా
కలికికన్నులచూపు కడలేనితరితీపు
మొలకచన్నుల నివు మోచేటిమోపు
తెలిసిచూడ వలపు తెగరానిరారాపు
కలిగె నింతికడకు గక్కన రారాదా
వనితచిగురుమోవి వన్నెలైన చెంగావి
దినదినమును నీకు తియ్యనితావి
చెనకి మీ యిద్దరికి జెప్పితి నే నిండువావి
యెనసె నింతికడకు నిప్పుడే రారాదా
అలమేలుమంగమాట అమరు గోవిలపాట
కలయికలకు నిదె కాగిటపూట
యెలమి శ్రీవేంకటేశ యీకె గూడితి విచ్చోట
తలచి యింతికడకు దప్పక రారాదా
ETi jOli cEkoMTivi yeMtavirALi
nITuna viMtikaDaku nEDE rArAdA
kalikikannulacUpu kaDalEnitaritIpu
molakacannula nIvu mOcETimOpu
telisicUDa valapu tegarAnirArApu
kalige niMtikaDaku gakkana rArAdA
vanitacigurumOvi vannelaina ceMgAvi
dinadinamunu nIku tiyyanitAvi
cenaki mI yiddariki jeppiti nE niMDuvAvi
yenase niMtikaDaku nippuDE rArAdA
alamElumaMgamATa amaru gOvilapATa
kalayikalaku nide kAgiTapUTa
yelami SrIvEMkaTESa yIke gUDiti viccOTa
talaci yiMtikaDaku dappaka rArAdA
ANNAMAYYA BOOK NO--24
SAMKIRTANA--464
RAGAM MENTIONED--SalAMGANatA
No comments:
Post a Comment