BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday 21 February, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM




SRIVANI

ఎంతవాడవయ్యా నీవు యెక్కడెక్కడ 
పొంత నీ జాణతనాలు పొగిడేము నేము

మాటలనే తేనెలూరి మంతనాన నోరు యూరి
యేటవెట్టే నీమహిమ లెక్కడెక్కడ
తేటలు నీచేతవిని దేహమెల్లాజెమరించె
మూటలుగా నవ్వితిమి మొక్కేము నీకు

చూపులనే వాడిరేగి సొలపుల నాసరేగీ
యేపున నీయెమ్మెలివి యెక్కడెక్కడ
తీపుల నీపాల జిక్కి తిద్దుపడె గుణమెల్ల
మోపుగా వలచితిమి మొక్కేము నీకు

కందువల తమిపుట్టె కాగిట బీరము వుట్టీ
యిందులోని నీనేరుపులెక్కడెక్కడ
పొందితి శ్రీవేంకటేశ భోగము రతులకెక్కె 
ముందర నింకొకమాటు మొక్కేము నీకు


emtavaaDavayyA nIvu yekkaDekkaDa 
pomta nI jANatanaalu pogiDEmu nEmu


maaTalanE tEnelUri mamtanaana nOru yUri
yETaveTTE nImahima lekkaDekkaDa
tETalu nIcEtavini dEhamellaajemarimce
mUTalugaa navvitimi mokkEmu nIku


cUpulanE vADirEgi solapula naasarEgI
yEpuna nIyemmelivi yekkaDekkaDa
tIpula nIpAla jikki tiddupaDe guNamella
mOpugaa valacitimi mokkEmu nIku


kamduvala tamipuTTe kaagiTa bIramu vuTTI
yimdulOni nInErupulekkaDekkaDa
pomditi SrIvEMkaTESa bhOgamu ratulakekke 
mumdara nimkokamaaTu mokkEmu nIku
ANNAMAYYA LYRICS BOOK--27
SAMKIRTANA--292
PAGE NO --197

No comments:

Post a Comment