BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 22 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--ADHYATMIKAM



NEDUNURI
సులభమా మనుజులకు హరిభక్తి
వలనొంది మరికదా వైష్ణవుడౌట


కొదలేని తపములు కోటాన గోటులు 
నదన నాచరించి యటమీద 
పదిలమైన కర్మల బంధములన్నియు 

వదిలించుకొని కదా వైష్ణవుడౌట 

తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్య 

అనఘుడై చేసిన యటమీదట 
జననములన్నిట జనియించి పరమ పా-

వనుడై మరికద వైష్ణవుడౌట 

తిరిగి తిరిగి పెక్కుతీర్థములన్నియు 

నరలేక సెవించినమీద
తిరువేంకటాచలాధిపుడైన కరిరాజ-
వరదుని కృపగద వైష్ణవుడౌట 


sulaBamA manujulaku hariBakti 
valanoMdi marikadA vaiShNavuDauTa 

kodalEni tapamulu kOTAna gOTulu 

nadana nAcariMci yaTamIda 
padilamaina karmala baMdhamulanniyu 

vadiliMcukoni kadA vaiShNavuDauTa 

tanivOni yAgataMtramulu lakShalasaMKya 

anaGuDai cEsina yaTamIdaTa 
jananamulanniTa janiyiMci parama pA- 

vanuDai marikada vaiShNavuDauTa 

tirigi tirigi pekkutIrthamulanniyu 

naralEka seviMcinamIdaTa 
tiruvEMkaTAcalAdhipuDaina karirAja- 

varaduni kRupagada vaiShNavuDauTa 

No comments:

Post a Comment