BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 3 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


ANURADHA SRIRAM
మొక్కరమ్మ చెలులాల మోహనాకారుడు వీడే
వెక్కసపు చేతల శ్రీవేంకటేశుడూ


సంతోసాన నాదె పెండ్లిచవికెలో గూచున్నాడు
మంతనములాడుకొంటా మగువలతో
పొంతనే సరసాలాడీ భూపతిచెరువు దండ
వింతసింగారాలతో శ్రీవేంకటేశుడూ

జోడైనరత్నాల సొమ్ములువెట్టుకున్నాడు
వాడికైన వూడిగపువారితోగూడి
వీడెములు సేసుకొంటా వికవికనవ్వూకొంటా
వేడుకకాడైనాడు శ్రీవేంకటేశుడూ



తలకొన్న కమ్మపూవుదండలతోనున్నాడు
లలిపూసిన పరిమళాలు మించగా
పలురతుల దనిసి బాగుగా దేవుళ్ళు తాను
విలసిల్లీనిదిగో శ్రీవేంకటేశుడూ


mokkaramma celulaala mOhanaakaaruDu vIDE
vekkasapu cEtala SrIvEMkaTESuDU


samtOsaana naade peMDlicavikelO gUcunnADu
mamtanamulaaDukoMTA maguvalatO
pomtanE sarasaalaaDI bhUpaticeruvu daMDa
vimtasimgaaraalatO SrIvEMkaTESuDU


jODainaratnaala sommuluveTTukunnADu
vaaDikaina vUDigapuvaaritOgUDi
vIDemulu sEsukomTA vikavikanavvUkoMTA
vEDukakADainaaDu SrIvEMkaTESuDU


talakonna kammapUvudaMDalatOnunnaaDu
lalipUsina parimaLAlu mimcagaa
paluratula danisi baagugaa dEvuLLu taanu
vilasillInidigO SrIvEMkaTESuDU





No comments:

Post a Comment