BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday, 2 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM


BKP


వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుడును సమేళి

నెలత మోమునకు నీ కనుచూపులు
నిలువున ముత్యపు నివాళి
కొలదికి మీరిన గురుకుచములకును
తొలకు నీ మనసు దువ్వాళి

వనిత నిండుజవ్వన గర్వమునకు
ఘనమగు నీ రతి కరాళి
వెనకముందరల వెలది మేనికిని
పెనగు గోరికొన పిసాళి

పడతి కోరికల భావంబునకును
కడు కడు నీతమి గయ్యాళి
చిడిముడి మగువకు శ్రీవేంకటపతి

విడువని కూటపు విరాళి

   
valapulu valapulu vayyALi
chalamari maruDunu samELi

nelata mOmunaku nI kanuchUpulu
niluvuna mutyapu nivALi
koladiki mIrina gurukuchamulakunu
tolaku nI manasu duvvALi

vanita niMDujavvana garvamunaku
ghanamagu nI rati karALi
venakamuMdarala veladi mEnikini
penagu gOrikona pisALi

paDati kOrikala bhAvaMbunakunu
kaDu kaDu nitami gayyALi
chiDimuDi maguvaku SrIvEMkaTapati
viDuvani kUTapu virALi



హరిశరణాగతిమండలి,భువనేశ్వర్ లో డా.ప్రసాద్ కూడా చాలా బాగా పాడతారు ఈ సంకీర్తన.

No comments:

Post a Comment