N.C.SATYANARAYANA& B.M VASAMTA
ఆదినారాయణా నాకు అభయమీయవె
కాదని తప్పులెంచక కరుణా నిధీ
తుదకెక్క నింద్రియపు దొంగలకు దాపిచ్చితి
ఎదుటికి రాగా నీవేమి యందువో
మదించి నాలోనుండగ మరచితి నేనిన్ను
యిదె కానుకియ్యగా నీవేమందువో
పక్కన నీయాజ్ఞ దోసి పాపములెల్లా జేసితి
యిక్కడ నే మొక్కగా నీవేమందువో
దిక్కు నీవుండగా పరదేవతలా గొలిచితి
నెక్కొని రక్షించుమంటే నీవిక నేమందువో
తొట్టి కామక్రోధాలతో దూరులెల్లా గట్టుకొంటి
యిట్టె ముద్ర మోచెనంటే నేమందువో
నెట్టన శ్రీవేంకటేశ నీకు అలమేల్మంగకు
గట్టిగా నేలెంకనైతి కరుణించేమందువో
AdinArAyaNA nAku abhayamIyave
kaadani tappulemcaka karuNA nidhI
tudakekka nimdriyapu domgalaku daapicciti
eduTiki rAgA nIvEmi yamduvO
madimci naalOnuMDaga maraciti nEninnu
yide kaanukiyyagaa nIvEmamduvO
pakkana nIyAjna dOsi paapamulellaa jEsiti
yikkaDa nE mokkagaa nIvEmamduvO
dikku nIvumDagaa paradEvatalaa goliciti
nekkoni rakShimcumamTE nIvika nEmamduvO
toTTi kaamakrOdhaalatO dUrulellaa gaTTukoMTi
yiTTe mudra mOcenamTE nEmamduvO
neTTana SrIvEmkaTESa nIku alamElmamgaku
gaTTigA nElemkanaiti karuNimcEmamduvO
book--15
samkIrtana--447
salmganaaTa rAgam
No comments:
Post a Comment