AUDIO
పుట్టిన మొదలు నేను పుణ్యమేమి కాననైతి?
యెట్టు గాచేవయ్య నన్ను ఇందిరానాథా?
కామినుల జూచిచూచి కన్నుల కొంతపాపము
వేమరు నిందలు విని వీనుల కొంతపాపము
నామువార కల్లలాడి నాలిక కొంతపాపము
గోమున పాపము మేన కుప్పలాయ నివిగో
కానిచోట్లకు నేగి కాగిళ్ళ కొంతపాపము
సేవ దానాలందుకొని చేతుల కొంతపాపము
మాననికోపమే పెంచి మతి కొంతపాపము
పూని పాపములే నాలో పోగులాయ నివిగో
చేసినట్టి వాడగాన చెప్ప నీకు చోటులేదు
దాసుడ నేనైతి కొన దయతలచితివయ్య
యీసరవులెల్ల జూచి యేమని నుతింతు నిన్ను
ఆసల శ్రీవేంకటేశ ఆయబోయ పనులు
puttinamodalunEnu puNyamEmi kaananiti?
yeTTugaacEvayya nannu yimdiraanadhaa?
kaaminulajUcicUci kannula komtapaapamu
vEmarunimdalu vini vInulapaapamu
naamuvaara kallalaaDi naalika komtapaapamu
gOmunapaapamu mEna kuppalaayanivigO
kaanicOTlakunEgi kaagiLLa komtapaapamu
sEvadaanaalamdukoni cEtula komtapaapamu
maananikOpame pemci mati komtapaapamu
pUni paapamu naalO pOgulaayanivigO
cEsinaTTivaaDagaana ceppanIku cOTulEdu
daasuDanEnaiati kona dayatalacitivayyaa
yIsaravulellajUci Emani nutimtu ninnu
Asala SrIvEmkaTESa aayabOya panulu
No comments:
Post a Comment