BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 27 January 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM

Malayappa Brahmotsavams
BKP CLASS


ఎవ్వరికీ చెప్పడమ్మ ఎదలోని మర్మము
నివ్వటిల్లభోగించ నెరజాణడితడు

మెలుతకెవ్వతెకో మేలువాడు కాబోలు
చలువగా పన్నీట మజ్జనమాడీనీ
కలయగా మేన పచ్చకప్పురము మెత్తుకుని
తలపులోని విరహతాపమెల్ల తీరను

అప్పటి సైత్యోపచారాలందుకుగా చేయబోను
గుప్పుకొని తులసి గురుదండలూ
ఎప్పుడూనాలవట్టములిరుమేలా చేకొనీని
చిప్పిలు వలపుల ముంచిన వెట్టదీరను

కూరిమిచలిమందులకొరకుగానె కాబోలు 
కోరి చలువరాళ్ళకొండనున్నాడు
ఈరీతి శ్రీవేంకటేశుడిందిరతో కూడినాడు
తారనిరతుల జాణతనములూ మీరను

evvarikI ceppaDamma edalOni marmamu
nivvaTillabhOgimca nerajaaNaDitaDu

melutakevvatekO mEluvADu kaabOlu
caluvagaa pannITa majjanamaaDInI
kalayagaa mEna paccakappuramu mettukuni
talapulOni virahataapamella tIranu

appaTi saityOpacaaraalamduku gaa cEyabOnu
guppukoni tulasi gurudaMDalU
eppuDUnaalavaTTamulirumElaa cEkonIni
cippilu valapula mumcina veTTadIranu

kUrimicalimamdulakorakugaane kaabOlu 
kOri caluvaraaLLakomDanunnADu
IrIti SrIvEmkaTESuDimdiratO kUDinaaDu
tAraniratula jANatanamulU mIranu



No comments:

Post a Comment