DWARAM TYAGARAJU
ఇదియె పో ప్రద్యుమ్న ఇహపర సాధనము
భవజలధుల తేప పరమయోగులకు
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
చరణం:-1
వామనగోవిందవిష్ణు వాసుదేవ హరికృష్ణ
దామోదర అచ్యుత మాధవ శ్రీధర
నీమహిమ గానలేము నిన్నెంచగలేము
నీనామజపమె చాలు నాలుకకు సులభము
ఇదియె పో ప్రద్యుమ్న ఇహపర సాధనము
భవజలధుల తేప పరమయోగులకు
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
చరణం:-2
అనిరుధ్ధ పురుషోత్తమ అధోక్షజ ఉపేంద్ర
జనార్ధన కేశవ సంకర్షణ
నిన్ను తలచగలేము నిన్ను తెలియగలేము
నునుపై నీ నామమె నోటికి సులభము
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
చరణం:-3
నారాయణ పద్మనాభ హృషీకేశ
నారసింహ.మధుసూధన త్రివిక్రమా
నీరూపు భావించలేము నిక్కపు శ్రీవేంకటేశ
ఆరయ నీనామజపమె అన్నిటా సులభము
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా
idiye pO pradyumna ihapara saadhanamu
bhavajaladhula tEpa paramayOgulaku
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
charaNaM:-1
vaamanagOviMdaviShNu vaasudEva harikRShNa
daamOdara achyuta maadhava SrIdhara
nImahima gaanalEmu ninneMcagalEmu
nInaamajapame caalu naalukaku sulabhamu
idiye pO pradyumna ihapara saadhanamu
bhavajaladhula tEpa paramayOgulaku
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
caraNaM:-2
anirudhdha puruShOttama adhOkShaja upEMdra
janaardhana kESava saMkarShaNa
ninnu talacagalEmu ninnu teliyagalEmu
nunupai nI naamame nOTiki sulabhamu
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
caraNaM:-3
naaraayaNa padmanaabha hRShIkESa
naarasiMha.madhusUdhana trivikramaa
nIrUpu bhaaviMcalEmu nikkapu SrIvEMkaTESa
aaraya nInaamajapame anniTA sulabhamu
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
gOviMdaa hari gOviMdA gOviMdA bhaja gOviMdA
No comments:
Post a Comment