BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Saturday, 19 November 2011

ANNAMAYYA SAMKIRTANALU--SARANAGATI





AUDIO LINK

నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలదీ
శ్రీదేవుడవు  నీచిత్తము నాభాగ్యము


అనుష్టానములు గతియని నమ్మి చేసితినా
తనువిది మలమూత్రములప్రోగు
జనులలోనుత్తమపుజన్మమే నమ్మినా
వొనర కర్మమనే వోదానబడినదీ


చదువుల శాస్త్రముల జాడలునమ్మితినా 
పొదరిన మతముల పోరటమదీ
మదిమదినుండిన నామసే నమ్మితినా 
అదియును యింద్రియాలకమ్ముడుపోయినదీ


పుత్రదార ధనధాన్య భూములనమ్మితినా
పాత్రమగు ఋణానుబంధములవీ
చిత్రముగా ననుగావు శ్రీవేంకటేశ నీవు
పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు



nIdAsyamokkaTE nilici nammagaladI
SrIdEvuDavu  nIcittamu nAbhaagyamu


anuShTAnamulu gatiyani nammi cEsitinaa
tanuvidi malamUtramulaprOgu
janulalOnuttamapujanmamE namminaa
vonara karmamanE vOdaanabaDinadI


caduvula SAstramula jaaDalunammitinaa 
podarina matamula pOraTamadI
madimadinuMDina naamasE nammitinaa 
adiyunu yiMdriyaalakammuDupOyinadI


putradaara dhanadhaanya bhUmulanammitinaa
paatramagu RNAnubaMdhamulavI
citramugaa nanugaavu SrIvEMkaTESa nIvu
patrapuShpamaatramE naabhaktiyellaa nIku




No comments:

Post a Comment