B.GOVIND
ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి
దిక్కని హరి గొల్చి బతికిరి తొంటివారు
నానాదేవతలున్నరు నానాలోకములున్నవి
నానావ్రతాలున్నవి నడచేటివి
జ్ఞానికి కామ్యకర్మాలు చెరపి పొందేవేమి
అనుకొన్నవేలోకాలైనా ఆయ గాక
ఒక్కడు దప్పికిద్రావు ఒక్కడు కడపనించు
ఒక్కడిందులాడు మడుగొక్కటియందే
చక్కజ్ఞానియైనవాడు సారార్ధము వేదమందు
తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా
యిది భగవద్గీతార్ధమిది అర్జునునితోను
యెదుటనే యుపదేశమిచ్చె కృష్ణుడు
వెదకి వినరో శ్రీవేంకటేశుదాసులారా
బతుకు ద్రోవ మనకు పాటించిచేకొనరో
okkaDE mOkShakarta okkaTE SaraNAgati
dikkani hari golci batikiri toMTivAru
naanaadEvatalunnaru naanaalOkamulunnavi
naanaavrataalunnavi naDacETivi
jnaaniki kaamyakarmaalu cerapi pomdEvEmi
anukonnavElOkaalainaa aaya gaaka
okkaDu dappikidraavu okkaDu kaDapaniMcu
okkaDiMdulaaDu maDugokkaTiyaMdE
cakkajnaaniyainavaaDu saaraardhamu vEdamaMdu
takkaka cEkonugaaka talakettukonunaa
yidi bhagavadgItaardhamidi arjununitOnu
yeduTanE yupadESamicce kRShNuDu
vedaki vinarO SrIvEMkaTESudaasulaaraa
batuku drOva manaku paaTiMcicEkonarO
No comments:
Post a Comment