BKP
ఎంత వడేయ నిదేమమ్మా
దొంతిరతులకు నెదురు చూచీని
అలికులవేణి అంబుజపాణి
కలికిమగువ రాగదవమ్మా
మలయజగంధి మదన విలాసిని
కలయికకు పతిగాచుకున్నాడు
సామజగమనా చక్కెరబొమ్మా
కామిని యిక రాగదవమ్మా
భూమాతిలకమ పసిడి సలాకా
నీమగడదివో నిలుచుకున్నాడు
వొడికపు నెలతా వొప్పుల కుప్పా
కడకల సతి రాగాదవమ్మా
గుడిగొని తెరలో గూడెనిన్నప్పుడు
యెడయక శ్రీవేంకటేశుడున్నాడు
eMta vaDEya nidEmammA
doMtiratulaku neduru chUchIni
alikulavENi aMbujapANi
kalikimaguva rAgadavammA
malayajagaMdhi madana vilAsini
kalayikaku patigAchukunnADu
sAmajagamanA chakkerabommA
kAmini yika rAgadavammA
bhUmAtilakama pasiDi salAkA
nImagaDadivO niluchukunnADu
voDikapu nelatA voppula kuppA
kaDakala sati rAgAdavammA
guDigoni teralO gUDeninnappuDu
yeDayaka SrIvEMkaTESuDunnADu
No comments:
Post a Comment