BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday 16 May, 2011

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI



N.C.SRIDEVI
అంతటనె వచ్చికాచు నాద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||


బంతిగట్టి నురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుకవుచ్చుకొన్నట్లు
చెంతల సంసారముసేయు నరుడందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||


వరుస చేదుతినేవాడు ఎడనెడ కొంత-
సరవితోడుత తీపు చవి గొన్నట్టు
దురితవిధులు సేసి దు:ఖించు మానవుడు
తరువాత హరిపేరు తలచుటే చాలు


కడుపేనైనవాడు  కాలకర్మవశమున
అడుగులోని నిధానమటుగన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరగక గురునాజ్ఞ
తొడగొన్నవాని భక్తి పొడవుటే చాలు



aMtaTane vachchikAchu nApadbhaMdhuDu hari
vaMtuku vAsiki natanivADanaMTEjAlu ||


baMtigaTTi nuripETi pasuramu leDaneDa
boMta nokkokka gavukavuchchukonnaTlu
cheMtala saMsAramusEyu naruDaMdulOne
koMtagoMta harinAtma goluchuTE chAlu ||


varusa cEdutinEvADu eDaneDa koMta-
saravitODuta tIpu cavi gonnaTTu
duritavidhulu sEsi du:khiMcu maanavuDu
taruvaata haripEru talacuTE cAlu


kaDupEnainavADu  kaalakarmavaSamuna
aDugulOni nidhaanamaTugannaTTu
yeDasi SrIvEMkaTESu neragaka gurunAj~na
toDagonnavaani bhakti poDavuTE cAlu

No comments:

Post a Comment