ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద
ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద
వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి
ఆసలు చూపేవు ప్రహ్లాద వరద
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు
ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద
నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక
అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక
అంటువాయ వదివో ప్రహ్లాద వరద
కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి-
వందముగ నీకెను ప్రహ్లాద వరద
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన
అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద
aunayya jANaDuvu prahlAda varada
Asalu veTTakumu prahlAdavarada
vEsaraka SrIsatitO vEDuka navvulu navvi
Asalu cUpEvu prahlAda varada
sEsa veTTina cEtula ceragu vaTTi tisEvu
A suddule ceppEnu prahlAda varada
naMTuna toDamIdanu nalinAkShi nekkiMcuka
aMTEvu siggulu prahlAdavarada
geMTuka E poddunu kElukElu kIliMcuka
aMTuvAya vadivO prahlAda varada
kaMduvatO kAgiliMci kaivasamu sEsukoMTi-
vaMdamuga nIkenu prahlAda varada
poMdi SrIvEMkaTamuna poMci auBaLamulOna
aMdi varAliccEvu prahlAda varada
NARASIMHA JAYANTHI SUBHAKANKSHALU..
B.V.S.RAMAKUMARI
balantrapuvariblog.blogspot.com
stotramalika.blogspot.com
siniganalahari.blogspot.com
stotramalika.blogspot.com
siniganalahari.blogspot.com
No comments:
Post a Comment