MADHU BALAKRISHNAN
కర్మమెంత మర్మమెంత కలిగిన కాలమందు
ధర్మమిది యేమరక తలచవో మనసా
చెలువపొంతనుంటే చిత్తమే చెదురుగాని
కలుగనేరదెంతైనా ఘనవిరతి
వులుక కగ్గి పొంతనుంటే గాకలేకాక
చలువ గలుగునా సంసారులకును
బంగారువోడగంటే బట్టనాస వుట్టుగాని
సంగతి విజ్ఞానపుజాడకురాదు
వెంగలి యభిని దింటే వెర్రి వెర్రాటాడు గాక
అంగవించునా వివేకమప్పుడే లోకులకు
శ్రీవేంకటేశుభక్తి చేరితే సౌఖ్యము గాని
ఆవలనంటవు పాపాలతిదు:ఖాలు
చేవనమౄతముగొంటే చిరంజీవియగుగాని
చావులేదు నోవులేదు సర్వజ్ఞులకు
karmameMta marmameMta kaligina kaalamaMdu
dharmamidi yEmaraka talacavO manasaa
celuvapomtanumTE cittamE cedurugaani
kaluganErademtainaa ghanavirati
vuluka kaggi pomtanuMTE gaakalEkaaka
caluva galugunaa samsaarulakunu
baMgaaruvODagaMTE baTTanaasa vuTTugaani
saMgati vij~naanapujaaDakurAdu
veMgali yabhini diMTE verri verrATADu gAka
aMgaviMcunaa vivEkamappuDE lOkulaku
SrIvEMkaTESubhakti cEritE soukhyamu gaani
aavalanaMTavu paapaalatidu:khaalu
cEvanamRutamugoMTE ciraMjIviyagugaani
caavulEdu nOvulEdu sarwaj~nulaku
No comments:
Post a Comment